నిమ్మల రామానాయుడు కుమార్తె పెళ్లి వేడుకలో సీఎం చంద్రబాబు
September 24, 2025
0
వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకులు
పాలకొల్లు:రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుక ఈరోజు పాలకొల్లు పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు పాలకొల్లు చేరుకున్నారు.
వివాహ వేడుక ప్రాంగణానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆహ్వానించి, ఆశీర్వదించిన కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకున్నారు.
ఈ వేడుకలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వివాహ మహోత్సవం ఉత్సాహభరితంగా సాగగా, పాలకొల్లు పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
