ఆ లేఖలో తాను ఓటుకు నోటు ఘటనలో తప్పు చేసినట్టు అంగీకరించిన మత్తయ్య, ఆ చర్య వెనుక చంద్రబాబు ప్రోత్సాహమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ అంశం వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు దిశ మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో, మత్తయ్య పాత్రపై దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ముందు మత్తయ్య లేఖ బయటకు రావడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మత్తయ్య లేఖలో పేర్కొన్న అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకునేలా పిటిషన్ రూపంలో దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఇప్పటికే సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
