విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జెఎన్టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్యను శనివారం కలిసివిద్యార్థి సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, పి డి యస్ యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర, ఏ ఐ ఎఫ్ డి యస్ జిల్లా కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ యస్ ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులను పూర్తిగా వ్యాపార వస్తువుగా మాత్రమే చూడడం జరుగుతుంది విద్యార్థుల ప్రాణాలను తాకట్టు పెట్టి లాభాలకే పరిమితం అవుతున్న ఇలాంటి కళాశాల నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండించాలి ముఖ్యంగా ఆ కళాశాలలో విద్యార్థుల సమస్యల్లో ఆహార విషయంలో గాని తరగతుల నిర్వహించడంలో గాని విద్యార్థులు ఏదైనా బాగాలేదు అంటే ఆ విద్యార్థులపై కక్ష కట్టి వారిని వేధించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటివరకు ఆ కళాశాలలో విద్యార్థుల బలిదానాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి మొన్న ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆ కళాశాలలోని ఉరేసుకొని చనిపోవడం గతింలో మాదిరిగా ఆ మరణానికి సంబంధించి వాస్తవాలను బయటకు రాకుండా కళాశాల యాజమాన్యం చూడడం జరిగింది ఈ మాదిరిగా ఆ కళాశాలలోని విద్యార్థులు గతంలో ఉరి వేసుకొని చనిపోవడం కూడా జరిగింది వాటిని అప్పటిలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉందని సమస్యలను బయటకు రాకుండా ఆ కళాశాల యాజమాన్యం జాగ్రత్త తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికైనా ఆ కళాశాలపై విచారణ చేపట్టి ఆ కళాశాలలో ఎటువంటి వసతులు ఉన్నాయి ఉంది అనే కోణంలో యూనివర్సిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజ నిజాలను బయటకు తీయాలని ఈరోజు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కోరడం జరిగింది.
ఏది ఏమైనా కళాశాల యాజమాన్యం అధికారులు విద్యార్థుల ప్రాణాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి కొనసాగించడం అత్యంత దారుణం ఇలాంటి సంఘటనలు జరగకుండా యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఇప్పటికైనా వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పి డి యస్ యు , నగర అధ్యక్షుడు బండారు శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment