దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని.. ఏపీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభంజొన్నగిరి బంగారు గని ప్రత్యేకతలు
భారత్‌లో బంగారం పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం కానుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా త్వరలోనే బంగారం ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొదటి దశలో ఏటా సుమారు 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నారు. రానున్న 2–3 ఏళ్లలో ఈ ఉత్పత్తిని 1 టన్ను వరకూ పెంచే లక్ష్యంతో సంస్థ ముందుకు వెళ్తోంది. జొన్నగిరి బంగారు గని ప్రత్యేకతలు స్థానం: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయి గ్రామాలు నిర్వహణ: డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ & జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తొలి దశ ఉత్పత్తి: ఏటా 750 కిలోలు రాబోయే లక్ష్యం: 1,000 కిలోలు (1 టన్ను) వరకు పెంపు భారత్‌లో బంగారం పరిస్థితి ప్రస్తుతం భారత్‌లో దేశీయ బంగారు ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే. అయితే, ఏటా సుమారు 1,000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావడం విశేషం. సంస్థ వివరాలు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఇప్పటికే కిర్గిస్తాన్, ఫిన్లాండ్, టాంజానియా వంటి దేశాల్లో మైనింగ్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. జొన్నగిరి బంగారు గని ఉత్పత్తి ప్రారంభమైతే దేశ బంగారు పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయం రాయనుందని నిపుణులు భావిస్తున్నారు