ఉరవకొండలో విచ్చలవిడి మద్యం దుకాణాలు: నిబంధనలు గాలికేనా?

0
అనంతపురం జిల్లా:ఉరవకొండ మండలంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. గ్రామగ్రామాన గొలుసు దుకాణాలు (బెల్టు షాపులు) యథేచ్ఛగా నడుస్తున్నా, వీటిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు మద్యం దుకాణాలను బడి, గుడి ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కళాశాల పక్కనే ఒక మద్యం దుకాణం, మరో దేవాలయం సమీపంలో ఇంకో దుకాణం ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధికార పార్టీ అధినేత గొలుసు దుకాణాలను అరికడతామని బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పాత్రికేయులపై ఆరోపణలు గొలుసు రాత ల కట్టడికి పాత్రికేయుని రేటు రోజుకి రూ 33 /లు ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన కొంతమంది పాత్రికేయులు సైతం అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గొలుసు దుకాణాల నిర్వాహకులు, మద్యం దుకాణాల యజమానులు అక్రమాలను వెలుగులోకి రాకుండా చేయడానికి, నెలకు వెయ్యి రూపాయల చొప్పున మామూళ్లు ఇస్తున్నారని, అంటే ఒక రోజుకు కేవలం ₹33/- మాత్రమే అని చెప్పడం సిగ్గుచేటు. ఇది పత్రికా వృత్తి పవిత్రతను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలపై ప్రభావం ఈ బెల్టు దుకాణాల కారణంగా పల్లెల్లో కూలీ చేసుకునేవారు సంపాదించిన డబ్బునంతా తాగుడుకు వెచ్చిస్తుండటంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరోవైపు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు ఈ సమస్యను అరికట్టడానికి ఉద్యమాలు చేపట్టకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యపై ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!