సాంఘిక దురాచారాలపై వేమన పదునైన సాహిత్యం

Malapati
0


ఉప్పు కర్పూరంబు నొక్క పోలికనుండు

 చూడచూడ రుచుల జాడ వేరయా

 పురుషులందు పుణ్యపురుషులు వేరయా

 విశ్వదాభిరామ వినురవేమ

 కుక్క గోవు కాదు

 కుందేలు పులి కాదు

 దోమ గజము కాదు

 దొడ్డదైనా లోబీ దాత గాడు

 విశ్వదాభిరామ వినురవేమ

ఇనుము విరిగినేని

 ఇనుమారు ముమ్మారు కాచి

 యతక నేర్చు గమ్మరీడు

  మరి అంత నేర్చునా

 విశ్వదాభిరామ వినురవేమ

నాటి సాంఘిక దురాచారాలపై కత్తిగట్టి తన కవిత్వంతో సమాజంలో నవయుగ చైతన్యం తెచ్చిన ప్రజా కవి యోగివేమన. తెలుగు సాహిత్యపు వెలుగు రేఖ. సమాజంలోని మంచి చెడుల్ని జీవిత సత్యాలను తెలియజేసినమహాయోగి.మట్టిలో పుట్టిమహోన్నత శిఖరాలను అందుకున్న మానవతామూర్తి.మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి వేమన. తన పద్యాలను ఆటవెలది చందస్సులో అలవోకగా లోకానికి అందించారు. మాలవాని నేల నిందిక నేల మొదటి కావాలని నాటి కులతత్వంపై ఈటెల్లాంటి పదాలను వేమన రాశారు.

 వేమన పుట్టుపూర్వోత్తరాలు చరిత్రకారుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కొందరు సర్కారీ ప్రాంతం వాడని మరికొందరు రాయలసీమ వాసి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేమన పుట్టిన ఊరు కొండవీడు అన్న ప్రచారం ఉంది. కడప జిల్లా సంతూర్ వాసి అని, కర్నూలు వాసినే అనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 ఏ ప్రాంతం వ్యక్తి అయిన ఈయన సాహిత్యం నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపింది. వేమన సూక్తి రక్త కరణం అనే పీఠికలో కొన్ని విషయాలను ఆయన గురించి ప్రస్తావించారు.

 క్రీస్తు శకము 13 28- 14 28 మధ్య కొండవీటి రెడ్డి రాజు చివరి పాలకుడు రాచి వేమారెడ్డి పాలన సాగిస్తుండేవాడు. ఆయన సోదరుడైన వేమన యుక్త వయసులో వేశ్యా లోలుడుగా మారినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత విష ప్రయోగం కారణంగా అడవుల్లో అపస్మారక స్థితిలో ఉన్న వేమనను అభిరాముడు అన్న కౌసల్య రక్షించాడు. అభిరాముడు లంచిక శివయోగి అనే యోగి పొంగవుని సేవిస్తుండేవాడు. ఉపదేశం పొందిన వేమన సంసార జీవితాలపై విరక్తి చెందిన సమాజాన్ని సంస్కరించడానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అభ్యుదయ కవిత్వాన్ని నాటి ప్రజలకు బోధిస్తూ అనంతపురం జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం కటారుపల్లి లో సమాధి అయ్యాడని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి.

-వేమన పద్యాలు వెలికి తీయడంలో సిపి బ్రౌన్ కృషి- వేమన పద్యాలను వెలికి తీసేందుకు కృషి చేసిన వ్యక్తి సిపి బ్రౌన్ అని చెప్పొచ్చు. ఈయన పద్యాలను క్రీస్తుశకం 18 29వ సంవత్సరంలో ప్రచురించారు. క్రీస్తు శకం 18 39 లో 12 పద్యాలను రెండవసారి అచ్చు వేయించారు. వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి అనువదించాడు. వేమన పద్యాలు సంస్కృత, తమిళ కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి.

- పామరులకు అర్థమయ్యేలా సాహిత్యం. పామరు లకు వేదం చెప్పిన వేమన తన నోటి నుంచి వచ్చే మాట పండితులకు పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో బోధించారు. రాత్రి బొమ్మ కేళా,రంగేలా వలవలు, గుడిలో గోపురాలుకుంభములకు కూడు, గూడు తాను కురున దేవుడు విశ్వదాభిరామ వినురవేమ అని దేవరతా రాధనను ఖండించారు.

 ఆయన నుంచి వెలువడిన పద్యాలలో ఉప్పు కర్పూరంబు నొక్క పోలికనుండు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా రా, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా, చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ లాంటివినేటికీ సమాజంలో ప్రజల నోళ్లలో నానుతున్నాయి.

 కాగా విగ్రహ పూజను వ్యతిరేకించిన వేమనకు నేటి సమాజంలో ఆలయాలు కట్టించి పూజలు జరిపిస్తుండటం గమనార్హం.

 కటారుపల్లిలోని వేమన ఆలయం అభివృద్ధి కోసంరూ.1.40 పనులు చేపట్టింది. సందర్శకుల కోసం వేమన ఆలయం వద్దవెన్నెల రెస్టారెంట్, వీడిది గదులు, గ్యాలరీ, వేమన సమాధి, ఉద్యానవనాలను శోభాయ మానంగా రూపుదిద్దారు.

-మాలపాటి శ్రీనివాసులు., ఉరవకొండ అనంతపురం జిల్లా

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!