 |
| తెల్ల బంగారం నల్లబడిపోతుండటంతో అన్నదాతల ఆవేదన |
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆశాజనకంగా పెరిగిన పత్తి పంట ఇప్పుడు విపరీతమైన వర్షాల దెబ్బకు నష్టపోతూ రైతుల కలలను ఛిద్రము చేస్తోంది.తెల్ల చీర కట్టుకున్నట్లుగా విరాజిల్లిన పత్తి పొలాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక దారుణ స్థితికి చేరుకున్నాయి. రైతులు సకాలంలో పత్తిని విడిపించలేకపోతుండడంతో ‘తెల్ల బంగారం’ క్రమంగా నల్లబడిపోతూ నష్టాల్లోకి జారుతోంది.“వర్షం రాకపోతే అనావృష్టి, వర్షం అధికంగా కురిస్తే అతివృష్టి— రైతు పరిస్థితి ఎప్పుడూ కష్టమే. కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో నష్టపోవడం మాకు మానసికంగా, ఆర్థికంగా పెద్ద దెబ్బ” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో సాగు చేసిన పత్తి ఇప్పుడు నిలువనే నష్టమవుతుందేమోనన్న భయంతో రైతులు వణుకుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటకు మచ్చలు ఏర్పడి, నాణ్యత తగ్గిపోతుండటంతో మార్కెట్లో ధరలు కూడా పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ— తక్షణమే నష్టాన్ని అంచనా వేసి, ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని, కనీస మద్దతు ధర (MSP)ను ఖరారు చేసి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.
ప్రకృతి విపత్తుల దెబ్బకు మరోసారి రైతులు నష్టపోతుండటంతో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల దృష్టి సారిస్తోంది.
Comments
Post a Comment