![]() |
| నేడు విద్యాలక్ష్మీ |
ఉరవకొండ సెప్టెంబర్ 28: అనంతపురం జిల్లా సుప్రసిద్ధ పుణ్య క్షేత్ర మైన పెన్నోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పరిధి లోని ఉద్భవ లక్ష్మీ దేవస్థానం లో ఆదివారం నాడు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉన్నాయి:
సెప్టెంబర్ 22, సోమవారం: ఆదిలక్ష్మి
సెప్టెంబర్ 23, మంగళవారం: గజలక్ష్మి
సెప్టెంబర్ 24, బుధవారం: ధాన్యలక్ష్మి
సెప్టెంబర్ 25, గురువారం: సౌభాగ్యలక్ష్మి
సెప్టెంబర్ 26, శుక్రవారం: ధనలక్ష్మి
సెప్టెంబర్ 27, శనివారం: సంతానలక్ష్మి
సెప్టెంబర్ 28, ఆదివారం: మహాలక్ష్మి
ఉదయం దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సుప్రభాత సేవ, పసుపు, కుంకుమార్చనలు నిర్వహించారు. పట్టు వస్త్రాలతో అలంకరించబడిన అమ్మవారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
నేడు విద్యాలక్ష్మి రూపంలో దర్శనం
దేవస్థానం పూజారులు ద్వారకనాథ ఆచార్యులు, మయూరం బాలాజీలు తెలిపిన వివరాల ప్రకారం, నేడు సోమవారం అమ్మవారు విద్యాలక్ష్మి రూపంలో భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు.

Comments
Post a Comment