ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం మంత్రి అనిత క్యూ లైన్లలో ఉన్న భక్తులను కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. "బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలి" అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు పాలనలో శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు.
"ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లపాటు కొనసాగాలని, రాష్ట్రంపై సైకోల కన్ను పడకుండా చూడాలని దుర్గమ్మను ప్రార్థించాను" అని మంత్రి అనిత పేర్కొన్నారు.

Comments
Post a Comment