సీమాభివృద్ధి కోసం తగ్గేదేలే. హై కోర్ట్ సాధన సమితి

Malapati
0

అభివృద్ధి కోసం కర్నూలు జిల్లా న్యాయవాదులు తమ పోరును తగ్గేదేలే దంటూ కొనసాగిస్తున్నారు.

హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో న్యాయపోరు కొనసాగుతోంది. సోమవారం న్యాయవాదులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక దశా దిశా నిర్దేశం చేశారు. కర్నూలు జిల్లా న్యాయవాదుల ప్రధాన డిమాండ్లుతెలియ జేశారు.

 శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.

 రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ముఖ్యంగా గుండ్రేవుల, వేదవతి, ఆర్.డి.ఎస్, తుంగ కాలువ, సిద్దేశ్వరం తెలుగు ప్రాజెక్టులను పూర్తి చేయాలి.

  మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని ఉద్దేశించిన జీవోను రద్దు చేసి, వాటి నిర్వహణను ప్రభుత్వం చేపట్టాలి.

  కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు కాకుండా, ప్రభుత్వమే స్థాపించి నడపాలి.                                                                      ఈ డిమాండ్లన్నీ రాయలసీమ ప్రాంత అభివృద్ధి, హక్కుల కోసం పోరాటంలో భాగంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం తాము తలొగ్గేది లేదని, తగ్గేదే లేదని హైకోర్టు సాధన సమితి పేర్కొంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!