అనంతపురం జిల్లా:ఎస్.ఆర్.ఐ.టి. కళాశాలలో జరిగిన ఘటనపై యూనివర్సిటీ అధికారులు తీసుకోవాల్సిన చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఘాటుగా ఖండిస్తున్నాయి. కళాశాల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థి ప్రాణం కోల్పోయిన విషాద ఘటనను విద్యార్థి సంఘాలు అత్యంత తీవ్రంగా పేర్కొన్నాయి.
సంఘటన జరిగిన ఇన్ని రోజులు అయినా కనీసం యూనివర్సిటీ అధికారులు ఆ కళాశాల ను సందర్శన చెయ్యలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా ఈ కళాశాలలో విద్యార్థిని హాస్టల్ లో సూసైడ్ చేసుకున్న సంఘట మరియు విద్యార్థులు ఆహారం వికటించి దాదాపు 30 పై విద్యార్థులు హాస్పిటల్ చేరి మరియు విద్యార్థులు ఫీజులు విషయంలో అనేక సమస్యలు కళాశాల యాజమాన్యం నుంచి ఎదుర్కొంటున్న ఇప్పటికీ రాజకీయ ఇన్ఫ్లెన్స్ వలన ఈ కళాశాలపై ఎటువంటి చర్యలు లేదు కావున ఇప్పటికన్నా చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది.ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల కళాశాల నిర్వహణపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర, ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి సిద్దు, మరియు నాయకులు తేజ, ప్రతాప్, వంశీ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment