న్యూఢిల్లీ: దేశ తపాలా సేవల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్టు విధానంను తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. ఇకపై రిజిస్టర్ పోస్టు ఒక విలువ ఆధారిత సేవగా స్పీడ్ పోస్టు కింద అందుబాటులోకి రానుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి వస్తోంది. అదనంగా కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ సేవను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ఉత్తరాలను చిరునామాదారుకే పోస్టుమన్ అందజేయాలి. ఇందుకోసం సంతకం తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవడానికి నిర్దేశిత టారిఫ్‌పై ప్రతి ఆర్టికల్‌కు రూ.5 అదనంగా (జీఎస్టీ మినహాయించి) వసూలు చేయనున్నారు.
ఇక స్పీడ్ పోస్టుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలో, ఉత్తరం పంపిణీ సమయంలో చిరునామాదారుని మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించిన తర్వాతే పోస్టుమన్ ఉత్తరాన్ని అందజేస్తాడు. ఈ సేవకూ నిర్దేశిత టారిఫ్‌పై రూ.5 అదనంగా చెల్లించాలి.
విద్యార్థులకు ఉపశమనం
స్పీడ్ పోస్టు చార్జీలను విద్యార్థులకు 10 శాతం తగ్గిస్తూ తపాలా శాఖ నిర్ణయం తీసుకుంది.
బల్క్ సర్వీసులకు రాయితీ
సంస్థలు బల్క్ సర్వీసులను వినియోగిస్తే, వారికి ప్రత్యేకంగా 5 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

Comments
Post a Comment