ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణమునందు రాష్ట్రస్థాయి 28వ సబ్ జూనియర్ సెపక్తక్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అధ్యక్షత వహించారు జిల్లా క్రీడా శాఖ అధికారి అయినటువంటి మంజుల గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఎంఈఓ ఈశ్వరప్ప జిల్లా సంఘం సప్తగిరి మల్లి ప్రెసిడెంట్ షాహిన్గారు,ఎస్ కె ఆర్ క్లబ్ కార్యదర్శి రవీంద్ర గారు లైన్స్ క్లబ్ లక్ష్మీనారాయణ నాగేశ్వరావు గణేష్ అనంతపురం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నాగరాజు , సత్య సాయి జిల్లా స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి డి మొరార్జీ యాదవ్ క్రీడాకారులు నిర్వహించినటువంటి మార్చి ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు తర్వాత క్రీడాజ్యోతిని వెలిగించారు ఈ టోర్నమెంట్ నందు 17 జిల్లాలకు చెందినటువంటి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి బాల బాలికలకు వసిటి ఏర్పాట్లను ఆర్డిటి చేసినది అని నిర్వాహకులు తెలిపారు ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి ప్రసాద్ పుల్లా రాఘవేంద్ర కే నాగరాజు పి ప్రభాకర్ మంజునాథ్ జనార్ధన్ శివకుమార్ రాయుడు కృష్ణ నాగేంద్ర పాల్గొన్నారు
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

Comments
Post a Comment