విడపనకల్ మండలం లో అంగన్వాడి సెంటర్ల ఆకస్మిక తనిఖీ - ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ హరిప్రసాద్ యాదవ్.
ప్రీ స్కూల్ హాజరీ శాతంపెరిగేలా చర్యలకు ఆదేశాలు
విడపనకల్ మండలంలోని పలు గ్రామాల లోని ఎస్సీ కాలనీలోని గల అంగన్వాడీ కేంద్రాలను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గుంతకల్ రెవెన్యూ డివిజనల్ మెంబర్ హరి ప్రసాద్ యాదవ్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువులను పోషన్ ట్రాకర్ యాప్తో పాటు రిజిస్టర్లలో తప్పని సరిగా నమోదు చేయాల న్నారు. కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటిస్తూ పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అలాగే పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తూ ప్రీస్కూల్ హాజరు శాతం పెరిగేలా చూడాల న్నారు. అనంతరం రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలను అందించారు అలాగే విడపనకల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ ను మరియు విడపనకల్ పీ హెచ్ సీ ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు విడపనకల్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ కె.సురేష్ బాబు అలాగే అంగన్వాడి టీచర్లు విడపనకల్లు గౌసియా డోనేకల్లు సునీత గడేకల్లు హేమలత మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment