యస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిగ్గు తేల్చాలి. సిద్ధూ

Malapati
0

 

 యస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిగ్గు తేల్చాలని మంగళవారం విద్యార్థి సంఘాల నేతలు.అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు

 ఈ సందర్భంగా సిద్ధూ, మాట్లాడుతూ ఎస్ఆర్ఐటి కళాశాలలో విద్యార్థిని మరణించి ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం ఇప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు ఒక పక్క విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోటున్న ఇప్పటికీ ప్రభుత్వం కనీసం విద్యార్థి మరణపై కారణాలు చెప్పడం లేదని ప్రభుత్వన్నీ తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలపడం జరిగింది.                                                     యస్ ఆర్ ఐ టి కళాశాలలో చోటు చేసుకున్న విద్యార్థి మరణం ఒక్క వ్యక్తిగత దురదృష్టం కాదు. ఇది ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నెలకొన్న దోపిడీ, నిర్లక్ష్యం, అణచివేతలకు నిదర్శనం. విద్యార్థులు విద్యను పొందడానికి కళాశాలల్లో అడుగుపెడితే, ఆ ప్రదేశం జ్ఞానం ఇచ్చే ఆలయం కావాలి గానీ, ప్రాణాలను బలి తీసుకునే ఉరితాడుగా మారకూడదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేట్ కళాశాలల దోపిడీతో ఇవాళ అదే వాస్తవం అవుతోంది.                                              ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు, దోపిడీ విధానాలు, మానసిక ఒత్తిళ్లతో విద్యార్థుల జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, మానవీయ విలువల లోపం, విద్యార్థుల సమస్యల పట్ల అసంవేదన వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏదంటే – ఈ పరిస్థితికి అసలు బాధ్యుడు ఎవరు?                                                       ఇలాంటి ఘటనలపై మౌనం వహించడం అంటే విద్యార్థి ప్రాణాలపై రాజీ పడటమే. విద్యార్థుల హక్కులను కాపాడటం, భద్రతను నిర్ధారించడం, మానసిక ఒత్తిడుల నుంచి విముక్తి కలిగే విధంగా విద్యా విధానాన్ని మార్చడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.                                          విద్యార్థి మరణంపై ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే, అది విద్యా హంతక పాలన అనే ముద్రను తప్పించుకోలేరు. విద్యార్థుల ప్రాణాలు తేలికైనవికావు. బాధ్యులపై సచ్చిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ దోపిడీని అరికట్టాలి.                                                          ఈ కార్యక్రమంలో ఏ ఐ యస్ ఏ జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర , ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి సిద్దు మరియు ఏ ఐ యస్ ఏ నాయకులు ప్రతాప్ , మరియు శివ , తేజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!