ధర్మమ వరం :ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:
సామాన్య నిరుపేదలకు కూడా కార్పొరేట్ తరహాలో వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం టిడిపి కార్యాలయంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 14 మంది లబ్దిదారులకు 9 లక్షల 5 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పరిటాల శ్రీరామ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి వైద్యాన్ని చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసే విధంగా... చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే ఈ 15 నెలల కాలంలో వైద్య రంగానికి ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని వారిని... సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలా మందికి సహాయం అందించినట్లు చెప్పారు.
