ఉరవకొండ:న్యూస్ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07
_విడపనకల్లు మండలం గడేకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వాల్మీకి సోదరులు.వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు వాల్మీకి సోదరులు మాట్లాడుతూ హిందూ మానవ సమాజానికి ఆదర్శనీయుడైన వాల్మీకి మహర్షి రామాయణం అనే గ్రంథాన్ని రచించారని,మన మనస్సు మారితే ఎవరైనా మహానుభావులుగా ఎదగగలరని చేసి చూపించడమే కాకుండా,మానవాళికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి,మన కులదైవమైనటువంటి వాల్మీకి మహర్షి అని కొనియాడారు.ఆయన చూపిన సత్యం,ధర్మం,నీతి మార్గాల్లో మన వాల్మీకి వంశస్థులు నడుచుకుంటూ సమాజానికి సేవ చేయడంతో పాటు,అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.సాయంత్రం వాల్మీకి చిత్రపటాన్ని బంగారు వర్ణంతో అలంకరించిన అశ్వరథంలో పెట్టి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు హంపయ్య,దేవేంద్ర,గోపాల్,శేఖర్,భీమేష్(మాస్),హేమంత్,కృష్ణ,దస్తగిరి,రాముడు, సంజీవ్,లక్ష్మీకాంత్,నెట్టి,నాగరాజు,హరి,తిప్పేరుద్ర,సీతప్ప,అంజి,తిక్కన్న,సాయి,కిషోర్,పెద్దయ్య పలువురు వాల్మీకి సోదరులు పాల్గొన్నారు_

Comments
Post a Comment