ఉరవకొండ: ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:
రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ బుధవారం (08-10-2025) ఉరవకొండలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఉదయం 10:30 గంటలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రి కార్యాలయం తెలియజేసింది.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ శ్రేణులతో చర్చించేందుకు మంత్రి ఉరవకొండకు రానున్నట్లు సమాచారం.

Comments
Post a Comment