-తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే దగ్గుపాటి పిలుపు
*-బెంగళూరులో జరిగే పోటీల్లో రాణించాలన్న ఎమ్మెల్యే*
ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 27:
అనంతపురం పేరు జాతీయ స్థాయిలో వినిపించాలని తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 42వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి జూనియర్ తైక్వాండో పోటీల్లో అనంతపురం వాసులు గెలుపొందారు. విజయనగరం జిల్లాలో జరిగిన పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటిని కలవగా.. వారిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురం పేరు వినిపించేలా చేశారన్నారు. ఇప్పుడు బెంగళూరులో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ కు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని.. తల్లిందడ్రులు తమ పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.



Comments
Post a Comment