-వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించి తీరాలి: -ఉద్యమం ఉద్ధృతం చేస్తాం – చంద్రచర్ల హరి డిమాండ్
ఉరవకొండ అక్టోబర్ 26:
వాల్మీకి సామాజిక వర్గానికి ఎస్టీ (Scheduled Tribe) రిజర్వేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు చంద్రచర్ల హరి వాల్మీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉరవకొండలోని వాల్మీకి భవన్‌లో గురువారం నిర్వహించిన వాల్మీకుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్టీ రిజర్వేషన్ సాధన దిశగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.
60 ఏళ్లుగా మోసం, ఇక ఉపేక్షించం!
ఈ సందర్భంగా చంద్రచర్ల హరి మాట్లాడుతూ.. గత 60 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెడుతున్నాయని మండిపడ్డారు.
* సరైన సమయం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున ఇదే సరియైన సమయంగా భావించి, రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
ఐక్యతే బలం: వాల్మీకులలో ఐక్యత ఉంటేనే ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోగలమని, తద్వారా తమ పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక, రాజకీయ ఎదుగుదల లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
మహోద్యమంగా మార్చాలని పిలుపు:
ఉరవకొండ వేదికగా జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఉరవకొండ, విడపనకల్, వజ్రకరూరు, కూడేరు, వెలుగుప్ప మండలాల నుంచి దాదాపు 200 మంది వాల్మీకులు హాజరయ్యారు.
చంద్రచర్ల హరి పిలుపునిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వాల్మీకి పెద్దలు, యువత, మహిళలు అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు డి. సురేష్, నారాయణప్ప ముండా, ఓబులేష్, సుశీలమ్మ, ఇంద్రవతి, సురేంద్ర, దిద్దేకుంట రామాంజనేయులు, శ్రీరాములు, చుక్క రాజు, శ్రీలేఖ టీచర్, అనుమప్ప, వన్నూరు రామాంజనేయులు, మోపిడి రామకృష్ణ, కళ్యాణదుర్గం వెంకటేష్, కందేపల్లి రమేష్, బసవయ్య, విడపనకల్ సత్తి, బీసీ మళ్లీ తదితరులు పాల్గొన్నారు.





Comments
Post a Comment