పోలీసులపై తీవ్ర ఆరోపణలు: దాడి వెనుక 'ఈనాడు' విలేఖరి పాత్ర? హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని బాధితుల ఆగ్రహం!

Malapati
0

 








ఉరవకొండ అక్టోబర్ 26:

అనంతపురం జిల్లాలోని గాజుల మల్లాపురం భూ వివాదం దాడి కేసులో పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా స్థానిక 'ఈనాడు విలేఖరి' ఉన్నప్పటికీ, పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం, విచారణలో పక్షపాతంగా వ్యవహరించడం న్యాయానికి అన్యాయం చేయడమేనని బాధితులు ఆరోపిస్తున్నారు.రామదుర్గం గోవర్ధన్, అనసూయమ్మ, రామాంజినేయులు, శీనా, దినేష్ ఐదుగురిని నిందితులు చేస్తూ కేసు నమోదు చేశారు. నంబర్ వన్ నిందితుడు

 ఈనాడువిలేఖరి పై కేసు నమోదు చేయలేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నేరం చేసిన వారికంటే నేరం చేయించిన వారే పెద్ద నేరస్తులు అవుతారన్న ప్రాథమిక సూత్రం పోలీసులకు తెలియదా?

 విలేఖరి నుంచి ప్రాణహాని: వాంగ్మూలం అరణ్య రోదనేనా?

దాడికి గురైన రామదుర్గం ఆది నారాయణ తన వాంగ్మూలంలో దాడికి ప్రధాన కారణమైన విలేఖరి నుంచి తమకు ప్రాణహాని ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.

  కుట్ర కోణం: ఆ విలేఖరి తమ పొలంలో విద్యుత్ తీగలను నేలపై పరిచి, పొలం పనులకు వచ్చిన వారిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని కూడా ఫిర్యాది తెలిపారు.

  గత నేర చరిత్ర: గతంలో కూడా అదే విలేఖరి తమపై దాడి చేసి, మహిళ రాజకుమారిపై కారం పొడి చల్లి దాడి చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

 సంస్థకు మచ్చ: ఒక విద్యార్థి చావుకు కారణమైన వ్యక్తిని, ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తిని తమ సంస్థలో కొనసాగించడం జర్నలిజానికి, సంస్థకు తీరని మాయని మచ్చని బాధితులు భావోద్వేగంతో తెలిపారు.

 నిర్లక్ష్యం: ప్రాణహాని గురించి స్పష్టంగా తెలిపినా, పోలీసులు తమ గోడును పట్టించుకోకుండా అరణ్య రోదనగా మార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హత్యాయత్నం బదులు చిన్న కేసు నమోదు:

నిందితులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఫిర్యాది భార్య రాజకుమారికి బలమైన గాయాలు, పిల్లలకు గోకుడు గాయాలు అయ్యాయి.

 బాధితుల ప్రశ్న: కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేస్తే అది హత్యా నేరం (Attempt to Murder) కాదా అని బాధితులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

 పోలీసుల చర్య: అయితే, పాల్తూరు పోలీసులు సెక్షన్ BNS 118(1) రెడ్ విత్ 3(5) కింద కేవలం చిన్నపాటి గాయాలు (Simple Hurt) కలిగించడం అనే సెక్షన్‌ను మాత్రమే ఆపాదించారు. ఈ సెక్షన్ కింద శిక్ష కేవలం ఒక సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది.

  పక్షపాత ఆరోపణలు: ఒక మండల స్థాయి పోలీస్ అధికారి సిఫారసు మేరకు కేసు తీవ్రతను తగ్గించే యత్నంలో భాగంగానే ఈ చిన్న సెక్షన్లను ఆపాదించారని, ఇది పోలీసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడాన్ని సూచిస్తుందని బాధితులు మండిపడుతున్నారు.

డిమాండ్: పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ప్రధాన సూత్రధారిపై హత్యాయత్నం కేసు (Attempt to Murder) నమోదు చేయాలని బాధితులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!