భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తిమంతమైన ఆయుధాలతో త్వరితగతిన స్పందించే 'భైరవ్' బెటాలియన్లు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 1న తొలి బెటాలియన్ను మోహరించనున్నట్లు సైన్యం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ఒక్కో యూనిట్లో 250 మంది సుశిక్షితులైన జవాన్లతో కూడిన 25 'భైరవ్' బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు~
