ఉరవకొండ, అక్టోబర్ 07, ట్రూ టైమ్స్ ఇండియా:
వాల్మీకి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తనయుడు వై. భీమ రెడ్డి నిన్న ఉరవకొండ నియోజకవర్గంలోని తమ స్వగ్రామం కొనకొండ్లలో మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులర్పించారు.
భీమ రెడ్డికి గ్రామ సర్పంచ్, వాల్మీకి సంఘం నాయకులు స్థానిక బస్టాండ్ ఆవరణలోని వాల్మీకి మందిరం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వాల్మీకి జీవితంపై ప్రశంసలు:
ఈ సందర్భంగా వై. భీమ రెడ్డి మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అని కొనియాడారు. పామరుడిగా ఉన్న వ్యక్తి సన్మార్గంలో నడచి, భగవంతుని కృపకు పాత్రుడై, సాక్షాత్తు రామాయణాన్ని రచించగలిగే ఉన్నత స్థితికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు.
వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వాల్మీకులు లేదా బోయ కులస్తుల ఆరాధ్య దైవంగా నిలిచిన వాల్మీకి మహర్షి జయంతిని తమ స్వగ్రామంలో జరుపుకోవడం మరింత శుభప్రదమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహర్షి అడుగుజాడల్లో నడిచి, సన్మార్గాన్ని అనుసరించి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నించాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఈ కార్యక్రమంలో కొనకొండ్ల గ్రామ సర్పంచ్ నంచర్ల ఇందిరమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు లాలెప్ప, రామాంజనేయులు, వాల్మీకి యువజన నాయకులు సంజప్ప, కొత్తపల్లి శివ, మాలాపురం కాశి, సుంకన్న, కొత్తపల్లి రాము, భాస్కర్, చిరంజీవి, పందికొండ నాగరాజు, కోనాపురం కృష్ణ, హమాలీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment