ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు బంజారా సంఘం కృతజ్ఞతలు

Malapati
0


ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 9

అనంతపురం: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడం పట్ల బంజారా సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సేవలను గుర్తించి, ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణకు కృషి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి లకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడిన బంజారా సంఘం నేత రూపా నాయక్, తాండ నంగ్రేర్ నాయక్ ఎస్.కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ఆర్డీటీ సంస్థ సుదీర్ఘకాలంగా అందిస్తున్న నిస్వార్థ సేవలు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని కొనియాడారు. 1969 నుంచి నేటి వరకు ఆర్డీటీ సంస్థ ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, పర్యావరణం, రైతు సాధికారత వంటి అనేక రంగాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా సేవలు:

  ఆరోగ్య సేవలు: ఆర్డీటీ సంస్థ జిల్లాలో నాలుగు ఆసుపత్రులను నిర్మించి, అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిరోజూ వేలాది మందికి వైద్య సేవలు అందిస్తోంది.

 విద్యారంగ ప్రోత్సాహం: ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, ఎంతో మందిని డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులుగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు.

  నిజాయితీతో కూడిన సేవ: కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హులకు మాత్రమే సేవలు అందించడం ఆర్డీటీ ప్రత్యేకత అన్నారు. గతంలో సంస్థపై అకారణంగా ఆరోపణలు చేసినప్పటికీ, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యంతో ఆర్డీటీ నిజాయితీతో కూడిన సేవలు నిరూపితమయ్యాయని పేర్కొన్నారు.

ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, కృషి చేసిన అధికారులకు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసియా ఖండంలోనే మచ్చలేని స్వచ్ఛంద సంస్థగా ఆర్డీటీ పేరు గడించిందని వారు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!