కచ్, గుజరాత్: కల్తీ ఉత్పత్తుల జాబితాలో తాజాగా నకిలీ టూత్‌పేస్టులు కూడా చేరాయి. ఇప్పటివరకు కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా, తాజాగా ప్రముఖ బ్రాండ్ 'కోల్‌గేట్' పేరుతో తయారుచేసిన నకిలీ టూత్‌పేస్ట్ బాక్సులు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో కలకలం రేపాయి.
కచ్ జిల్లాలోని చిత్రోడ్ ప్రాంతంలో నకిలీ టూత్‌పేస్టుల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి గుట్టురట్టు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ.9.43 లక్షల విలువైన నకిలీ సరకును స్వాధీనం చేసుకున్నారు.
వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించేలా తయారుచేసిన ఈ నకిలీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి ఎలా పంపిణీ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న సప్లై చైన్ ఏంటి? అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నకిలీ వస్తువుల దందాపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments
Post a Comment