రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
అమరావతిఅక్టోబర్ 23
: కల్తీ మద్యం పాపాత్ముడు జగనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అయిదేళ్ల జగన్ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి అధికారిక ముద్ర విచ్చలవిడిగా అమ్మకాలు చేశారన్నారు.
