No title

Malapati
0

 



దుబాయ్

 దుబాయ్‌లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

రోడ్‌ షోకు హాజరైన యూఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు.

రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

 ఏపీలోని వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.*

రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం*

 దుబాయ్ దేశం టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందింది.

టెక్నాలజీతో వచ్చే లాభాలను అర్థం చేసుకుని నేను ఐటీని ప్రమోట్ చేశాను.

నాడు ఐటీని అందిపుచ్చుకున్నవాళ్లే ఇప్పుడు పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజాలుగా ఎదిగారు.

 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం.

తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ 2071 నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

•భవిష్యత్ అంతా ఇన్నోవేషన్లు..వినూత్న ఆలోచనలదే.

అమరావతిలో రూ.100కోట్లతో గ్రంధాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శోభా గ్రూప్ కు ధన్యవాదాలు.

 నేను శోభా గ్రూప్ ప్రతినిధులను ఎప్పుడూ కలవలేదు... కానీ ఏపీకున్న క్రెడిబులిటీ వల్ల విరాళం ఇచ్చేందుకు శోభా గ్రూప్ ముందుకురావడం సంతోషం. 

 వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖలో పార్టనర్ షిప్ సదస్సుకు రావాలి.

ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి... ఎంఓయూలు కుదుర్చుకుందాం.. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం కూడా ఇచ్చేస్తాం.

వ్యవసాయాధారిత రాష్ట్రమైనా... అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.

రాయలసీమలో హర్టీకల్చర్, తీర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ రంగాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయి.

గివ్ బ్యాక్ పాలసీని మేం అమలు చేస్తున్నాం... అందరూ ఆ పాలసీని అమలు చేయాలని కోరుతున్నాం.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!