అనంతపురం జిల్లా: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేపట్టిన 'ప్రజా పోరాటం'లో భాగంగా 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం ఉరవకొండ నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నాయకులు శ్రీ విశ్వేశ్వర్ రెడ్డి, శ్రీ వై. ప్రణయ్ రెడ్డి మార్గదర్శకత్వంలో బుధవారం షేక్షానుపల్లి తాండ, కోనాపురం గ్రామాలలో 'రచ్చబండ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉరవకొండ రూరల్ మండల అబ్జర్వర్ డి. సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు ఎర్రిస్వామి రెడ్డి, ఎంపీపీ నరసింహులుతో పాటు ఈశ్వర్, ధనుంజయ, బీసీ మళ్లీ, కే. రమేష్, పూజారి ఐపీ రెడ్డి, గంజే గోపాల్, బన్నెల ఐపీ రెడ్డి, వెంకటేష్ నాయక్, రామకృష్ణప్ప, బొజ్జప్ప మరియు మూడు గ్రామాల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ప్రజా పోరాటానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

Comments
Post a Comment