రాయదుర్గం :
వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించే (Restoration of ST status) కీలకమైన అంశాన్ని కూటమి ప్రభుత్వంలోని వాల్మీకి ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) తప్పనిసరిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లాలని రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు నాయకుల బండి క్రిష్టప్ప పిలుపునిచ్చారు.
మంగళవారం రాయదుర్గం పట్టణంలోని మహర్షి శ్రీ వాల్మీకి కళ్యాణ మండపం ఆవరణలో సమితి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి క్రిష్టప్ప మాట్లాడుతూ, ఈ నెల 16న నంద్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్న ప్రధాని మోదీని కలిసి ఈ అంశంపై హామీ పొందాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధుల బాధ్యత:
2019లో కర్నూలు సభ సాక్షిగా ప్రస్తుత ప్రధానమంత్రి నాడు వాల్మీకులకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని గుర్తు చేయాల్సిన చారిత్రక బాధ్యత వాల్మీకి ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
వాల్మీకి ముద్దుబిడ్డలైన ప్రజాప్రతినిధులు అందరూ ఐకమత్యంతో వ్యవహరించి, వాల్మీకి సామాజిక వర్గం స్థితిగతులను మరోసారి ప్రధానికి వివరించి, ఉమ్మడి రాష్ట్రాల్లోని బోయ, వాల్మీకులను ఎస్టీ పునరుద్ధరణ జాబితాలో చేర్చాలని హామీ పొందాలని కోరారు.
వాల్మీకి సామాజిక వర్గానికి అండగా నిలిచి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడే సంఘం మన్ననలు పొందగలరని క్రిష్టప్ప తెలిపారు.
వాల్మీకి సంక్షేమ సేవా సమితి గౌరవ అధ్యక్షులు ఈ రామాంజనేయులు, ఉపాధ్యక్షులు మలకన్న, కార్యదర్శి ఎన్.టి. సిద్దప్ప, ప్రధాన సలహాదారులు తలారి రాజప్ప, మీడియా సలహాదారులు తలారి మల్లయ్య, బోయపాటి మరియు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి వాల్మీకి జోగప్ప, పై తోట రఘు, అజయ్ టైలర్ రఘు, ట్రాక్టర్ తిప్పేస్వామి, పై తోట ముత్తయ్య, ముద్దల రామాంజనేయులు, ఎన్. శ్రీనివాసులు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment