అనంతపురం (కలెక్టరేట్): కౌలు రైతులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం అనంతపురం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం కోసం పలు డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలులో కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు:
* అన్నదాత సుఖీభవ: కౌలు రైతులందరికీ 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని వర్తింపజేసి, ఆర్థిక సాయం అందించాలి.
బ్యాంకు రుణాలు: సిసిఆర్ సి (CCRC) కార్డులు కలిగిన ప్రతి కౌలు రైతుకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరు చేయాలి.
*దేవాలయ భూములు: దేవాలయ భూములను సాగు చేసుకుంటున్న కౌలు రైతులకు ఈ-క్రాప్ (e-Crop) నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి.
నూతన చట్టం: కౌలు రైతుల రక్షణ కోసం సమగ్రమైన నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి.
ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బాల రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గం కార్యదర్శి పెద్ద ముస్తూరు వెంకటేశులు, వజ్రకరూరు మండలం పొట్టిపాడు రామాంజనేయులు, ఉరవకొండ మండలం మోపిడి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment