పుట్టపర్తి, నవంబర్ 11, 2025
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు ఈరోజు (మంగళవారం) పుట్టపర్తిలో పర్యటించారు.
రాష్ట్ర మంత్రుల బృందం చైర్మన్ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్, దేవదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి ఈ పనులను పర్యవేక్షించారు.
హిల్ వ్యూ స్టేడియంలో తనిఖీలు:
మంత్రులు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, డిఐజి షిమోషి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ట్రస్టు సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ముఖ్యంగా:
వీవీఐపీలు, వీఐపీల రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు.
భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు, ట్రస్టు సభ్యులకు మంత్రులు పలు సూచనలు చేశారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎం.టి. కృష్ణబాబు, అజయ్ జైన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సాయి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.

Comments
Post a Comment