
అనంతపురం రాంనగర్‌లోని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున బంగారం మాయం ఘటన చోటు చేసుకుంది. మొత్తం 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం అదృశ్యమైనట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ బంగారాన్ని అక్రమంగా కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు బుధవారం బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజల సొమ్మును రక్షించాల్సిన బ్యాంక్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Post a Comment