ఈ బిల్లు అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఫలితంగా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీర్ఘకాలంగా జీతాలు నిలిచిపోయిన సర్కారీ ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది.
విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ సంకేతంగా పేర్కొంటున్నారు.
