లక్ష్యం మేరకే అనుకున్న టైంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు

0

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు కలిసి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.

మంత్రివర్యులు దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, జంట సొరంగాల డివాటరింగ్ పనులు, అలాగే ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఇతర నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ –

“వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లాను త్వరిగా ప్రకటిస్తాం. మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడ్‌లో పూర్తి చేస్తాం. కానీ వైసీపీ నాయకులకు పనీపాట లేక రోడ్లపై కోటి సంతకాల సేకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని అన్నారు.


జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు – ముఖ్యాంశాలు:

  • వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
  • మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను నిపుణుల బృందంతో పరిశీలించారు.
  • ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్ డివాటరింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
  • డివాటరింగ్ పనులు పూర్తి కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • “ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఏజెన్సీలకు, అధికారులకు కూడా లక్ష్యం ఉండాలి,” అని మంత్రి స్పష్టం చేశారు.
  • 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్దేశించారని, దానిని సకాలంలో పూర్తి చేయని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • టన్నెల్ లైనింగ్, బెంచింగ్ పనులు వెంటనే ప్రారంభించేందుకు అధికారులు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
  • ₹456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్‌కు పూర్తి చేయాలని ఆదేశించారు.
  • “వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతుల సాగు, తాగునీటి సమస్యలు తీర్చుతాం,” అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.




Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!