జనసమస్యల పరిష్కారానికి ముందడుగు – జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. గారి సూచనలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో భాగస్వామ్య పద్ధతిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నియంత్రణ దిశగా గ్రామాల్లో గ్రామస్తులు, పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో ప్రజలకు ఆస్తి నేరాలు, నివారణ చర్యలు, సైబర్ మోసాలు, గాంజా–ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే మహిళలు మరియు బాలబాలికలపై నేరాలు, చట్టాలు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో తగాదాలు, గొడవలు లేకుండా సామరస్యంగా జీవించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం, గంజాయి వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అరికట్టడంలో గ్రామస్థులు సహకరించాలని సూచించారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టి, చెడు ప్రవర్తన కలిగిన వారిని పోలీసు అధికారులు కౌన్సిలింగ్ చేస్తున్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.



Comments
Post a Comment