పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత ప్రధానమైన శ్రీస్వామివారి రథం నిర్మాణం ఆలస్యం అవుతున్న తీరుపై భక్తులు, గిరిజన సంఘం వ్యవస్థాపకులు సుంకే నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ఆలయ అభివృద్ధి పనుల కంటే ముందుగా, రథోత్సవానికి అతిప్రధానమైన నూతన రథాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
విరాళాల సొమ్ము ఏమైంది? ఆలయం ఆధునికీకరణ పనులు తరువాత చేపట్టినప్పటికీ, రథ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళంగా సేకరించిన మొత్తం కోటి రూపాయల సొమ్ము ఏమైందని సుంకే నాయక్ ప్రశ్నించారు.
మూడేళ్లుగా ఆలస్యం ఎందుకు? దాదాపు కోటి రూపాయల విరాళాలు సేకరించి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రథం నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోందనే ప్రశ్నలు భక్తులమదిని తొలిచి వేస్తున్నాయని గిరిజన సంఘం అధ్యక్షులు సుంకేనాయక్ ధ్వజ మెత్తారు.
నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? రథం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం అవసరమో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆలయ ఆదాయ వనరులు, మాన్యాలు, భక్తుల విరాళాలతో ఆదాయం సమకూరుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయం అధ్వాన్నంగా తయారైందని
భక్తులు, సుంకే నాయక్ తూర్పార బట్టారు. దేవాదాయ ధర్మదాయ శాఖకు చోద్యం చూస్తోందని విమర్శించారు.. ఈ నేపథ్యంలో, రథం నిర్మాణం ఆలస్యంపై ఈఓ వెంటనే జవాబుదారీతనాన్ని ప్రదర్శించి, రథ నిర్మాణ స్థితి, విరాళాల వినియోగంపై స్పష్టమైన ప్రకటన Grocery భక్తులు గిరిజన సంఘం వ్యవస్థాపకులు సుంకే నాయక్,డిమాండ్ చేశారు.

Comments
Post a Comment