అన్నదాత ఆక్రందన! పట్టించుకోని ప్రభుత్వం!

Malapati
0


 

--వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ.

  ‌‌ అన్నదాతల ఆక్రందన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెవిటి,మూగ, గుడ్డి దానిలా ప్రవర్తిస్తూ, అన్నదాత సుఖీభవ కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టి,ప్రస్తుతం 20,000 ఇస్తామనిచెప్పి, 17000కు కుదించి ఇస్తూ ఇదే రైతుల అన్ని సమస్యలకు పరిష్కారం అని అరచేయిని చూపించి మోచేతిని నాకిస్తున్నది.

 2025-26 ఖరీఫ్ లో

అతివృష్టి,అనావృష్టితో రైతులు ఆర్ధిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.

    పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కు తున్నారు, పొలం లోనే పంటను వదిలేస్తున్నారు.

అన్న దాతల కష్టాలను

తీర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏ మాత్రం చేయడం లేదు.

      ఖరీఫ్ లో

రాయలసీమ లో ప్రధాన పంట వేరుశనగ సాగు సంక్షోభం, ఉల్లి,సజ్జ,మొక్కజొన్న,పత్తి, అమ్మకాలు సంక్షోభం.

   రాయల సీమ హార్టికల్చర్ హబ్.పండ్లు,కూరగాయలు,పూల ఉత్పత్తిలో అగ్రస్తానం.

   రాష్ట్రం మొత్తం అన్ని రకాల పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే,ఇందులో అరటి ఒక్కటే 74లక్షల టన్నులు.ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే.ప్రత్యేకంగా G 9 అరటి ఉత్పత్తిలో అత్యంత వెనుకబడిన,అనంతపురం,కడప,అన్నమయ్య,సత్యసాయి జిల్లాలదే అగ్ర స్థానం.ప్రస్తుతం అరటి ధరలు క్వింటాలు 200 నుండి 300 రూ"కు పడిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.

    ఉల్లి రైతు ట్రక్కులతో ఉల్లిపాయలు పారబోయటం, పొలాల లోనే వదిలివేయటం, పంటను దున్నివేయటం చూసాం.నేడు అరటి రైతు గెలలను పారబోయటం,అరటి తోటను ట్రాక్టర్ తో దున్ని వేయడం చూస్తున్నాం.

 కష్టపడి సాగు చేసిన పొలాన్ని,ప్రేమతో పెంచుకున్న పంటను పారవేస్తూ రైతు మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు.ఈ సంక్షోభం నుండి కాపాడమని వేడుకుంటున్నారు.

మన కళ్ల ముందే ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి.

    రాష్ట్ర వ్యాప్తంగా అరటి తొమ్మిది జిల్లాలలో సాగవుతుంది,సుమారు 50 లక్షల టన్నుల పంట దిగుబడి ఉండి,అనేక రాష్ట్రాలకు ప్రత్యేకంగా దేశ రాజ ధాని ఢిల్లీకి ఎంతో ఆరోగ్య కరమైన పండును అందిస్తూ పెట్టు బడి కూడా రాని ధరకు అమ్ముకుంటున్నారు.అరటి సాగుకు పెట్టుబడి కూడా ఎక్కువే.

   అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ ప్రతి రైతు సంక్షోభమే.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం తప్ప.ఇంత వరకూ ఏ పంట పండించిన రైతునూ ఆదుకున్న దాఖలాలు లేవు.

      చివరికి గత వైసీపీ ప్రభుత్వంలో వలె ఉచిత ఇన్సూరెన్స్ లేదు,ఇన్పుట్ సబ్సిడీ కూడా లేకుండా చేసి రైతుల పట్ల అతి కఠోరంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి పతనం ఎంతో దూరం లేదునివెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!