ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తాంత్రికుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన హర్భజన్ అనే భూతవైద్యుడిని కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటికి పిలిపించగా ఈ దారుణం జరిగింది.
గొంతు నొప్పితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలికను చూసిన తాంత్రికుడు, ఆమెకు దెయ్యం పట్టిందని చెప్పి "మంత్రం చేస్తాను" అంటూ ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బట్టలు విప్పించి అసభ్యంగా తాకినట్లు బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసుల్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment