రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కోసం వైకల్య నిర్ధారణ (సదరం) ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబర్, డిసెంబర్ 2025 నెలల కోసం సదరం ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రజలు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి,
ఎరియా ఆసుపత్రుల్లో శారీరక మరియు దృష్టి వైకల్యం ఉన్నవారికి,
మరియు సి.హెచ్.సి. (CHC) లలో శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబడతాయని ఆయన వివరించారు.
వైకల్య ధ్రువీకరణ కోసం తగిన పత్రాలతో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సులభంగా ధ్రువీకరణ పొందవచ్చని చక్రదర్ ఐఏఎస్ సూచించారు.

Comments
Post a Comment