దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,100 పెరిగి రూ.1,17,150కు చేరింది.
బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.1,82,000కు చేరింది. ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు దారులు తాత్కాలికంగా వెనుకడుగు వేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం బంగారంపై దృష్టి సారిస్తున్నారు.

Comments
Post a Comment