 |
చెక్ పోస్ట్ తనిఖీ
|
ఉరవకొండ : ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విడపనకల్ మండలం , విడపనకల్ , డొనేకల్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. నాగమద్దయ్య, అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్‌ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ చెక్ పోస్ట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమంగా వచ్చే మద్యం రవాణాను పూర్తిగా అరికట్టాలని చెక్పోస్ట్ అధికారులు బ్రహ్మయ్య, రఫీ లకు, సిబ్బందికి తగిన మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎక్సైజ్ సిఐ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.