ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ, ఈ మహిమాన్వితమైన, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన మహా పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్థంగా తయారైందని వీహెచ్‌పీ ఎత్తి చూపింది. ఆదాయ వనరులు, మాన్యాలు, భక్తుల విరాళాలతో ఆదాయం సమకూరుతున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం కారణంగా ఆలయం అధ్వాన్నంగా తయారైందని సంస్థ పేర్కొంది.
ఆలయ అభివృద్ధికి కీలక డిమాండ్లు
జిల్లా అధ్యక్షులు శ్రీ తాళంకి వెంకట రత్నమయ్య సంతకంతో కూడిన ఈ లేఖలో భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, పర్యాటక కేంద్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి, ఆలయ శోభను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన 19 అంశాలను ప్రస్తావించారు.
పాలక మండలి పునరుద్ధరణ: పాలక మండలి లేని కారణంగా నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని, కావున పాలక మండలిని తక్షణమే పునరుద్ధరించాలని వీహెచ్‌పీ కోరింది.
కౌంటర్ల ఆధునికీకరణ: అవినీతికి తావులేకుండా ఉండేలా ఆధునిక టెక్నాలజీ ద్వారా దర్శనం కౌంటర్ మరియు ప్రసాదం కౌంటర్లను ఆధునీకరించాలి.
మౌలిక సదుపాయాల మెరుగుదల: వసతిగదులు, శిథిలావస్థలో ఉన్న భక్తులు నిర్మించిన సత్రాలలో విద్యుత్తు, టాయ్లెట్స్, నీటి సదుపాయం, పరిశుభ్రతలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శిథిలమైన వాటిని పునఃనిర్మించాలి.
ప్రజా సౌకర్యాలు: భక్తుల మనోభావాలతో ముడిపడివున్న తులాభారంను ఏర్పాటు చేయాలి. తుంగభద్ర నీటి ప్రవాహం వద్ద పార్కులు, చెక్ డ్యాంల వద్ద బల్లలు, సుందరీకరణ చేపట్టి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి. ప్రధాన రెండు మార్గాలను ఆధునీకరించాలి.
పునర్నిర్మాణం మరియు సుందరీకరణ: నీటి ప్రవాహం వద్ద ఉన్న నాగులకట్టను అభివృద్ధి చేయాలి. రథోత్సవంలో ఉపయోగించే శ్రీస్వామివారి రథంను భక్తిభావం ఉట్టిపడేలా నూతనంగా తయారు చేయాలి. కోనేరులు సుందరీకరణ చేయాలి. మహిమాన్విత నీటి ఊటను సరైన విధంగా కాలువను ఏర్పాటుచేసి ఆధునీకరించాలి.
ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రచారం: హిందూ ధర్మ సందేశాలను, ఆలయ చరిత్రను తెలియజేసే బోర్డులను గోడలపై వ్రాయించాలి. శ్రీవారి వరాహవధ స్థలంను ఆధునీకరించి, చరిత్రను తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలి.
పర్యాటకం మరియు ఆదాయం: వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. జింకలు, నెమళ్ళు పార్కులు ఏర్పాటుచేయడానికి అవకాశం ఉన్నందున దృష్టి సారించాలి. పెన్నహోబిళం కొండచుట్టూ విశాలమైన రహదారి, వ్యాపార సముదాయాలకు గదులు ఏర్పాటుచేసి ఆలయానికి ఆదాయ వనరులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
మార్గం మరియు నిర్వహణ: ఆమిద్యాల గ్రామం నుండి శ్రీవారి రాకపోకలు జరుగుచుంటాయి కావున వీలైనంత మెరుగైన రోడ్డు ఏర్పాటు చేయాలి. దేవాలయ మాన్యాల ద్వారా వచ్చే ఆదాయాలను సక్రమంగా వినియోగించాలి.
బాహ్య సహకారం మరియు కార్యక్రమాలు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో తగిన నిధులు మంజూరు జరిగేలా చర్యలు తీసుకొని, టీటీడీ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా పెన్నహోబిళంలో ఏర్పాటు చేయాలి.
మరుగుదొడ్ల నిర్వహణ: మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా అమలయ్యేలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలి.
భక్తుల భాగస్వామ్యం కోసం విజ్ఞప్తిచేసి నట్లు సీనియర్ బిజెపి నేత దగ్గుపాటి సౌభాగ్య, శ్రీ రామ్ తెలిపారు.


Comments
Post a Comment