అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల
రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో కోట్లాది మంది ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్ధిక హక్కులు రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు కల్పించారన్నారు. భారత రాజ్యాంగము నిర్మాణంలో అంబేద్కర్ నిర్వహించిన పాత్ర మరువలలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, డిజిటల్ అసిస్టెంట్ హనుమేష్, అగ్రికల్చర్ అసిస్టెంట్ చిరంజీవి, ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి, పావని, ఆశా కార్యకర్తలు లింగమ్మ, ధనలక్ష్మి, మల్లిక క్లాప్ మిత్రులు నెట్టికల్లు, రాజశేఖర్ పాల్గొన్నారు.

Comments
Post a Comment