ఎస్కేయూ నందు బీఈడీ కళాశాలకు రెగ్యులర్ ప్రొఫెసర్ ను ప్రిన్సిపాల్ గా నియమించినందుకు ఐసా హర్షం వ్యక్తం చేస్తుంది..
ఈ సందర్బంగా ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన మాట్లాడుతూ....
ఎస్కేయూ నందు విద్యా ప్రమాణాలను బలపర్చడంలో, శిక్షణా వ్యవస్థను పారదర్శకంగా నిలబెట్టడంలో ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు అని మేము భావిస్తున్నాం.
ఇదే విధంగా యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలల్లో కూడా వెంటనే రెగ్యులర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను ప్రిన్సిపల్స్‌గా నియమించాలని ఐసా డిమాండ్ చేస్తుంది. నాణ్యమైన అకడమిక్ పరిపాలన, విద్యార్థుల ప్రయోజనాలు, పారదర్శక వ్యవస్థ కోసం ఇది అత్యంత అవసరం.
ఇన్నాళ్లుగా బీఈడీ కళాశాలలో స్థిరమైన పరిపాలన లేకపోవడం వల్ల విద్యార్థుల అకడమిక్ అవసరాలు, కళాశాల అభివృద్ధి, నాణ్యత ఆధారిత శిక్షణ వంటి అంశాలు ప్రభావితమయ్యాయి. రెగ్యులర్ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించడం ద్వారా ఈ లోటులను భర్తీ చేసే అవకాశం లభించింది. విద్యా రంగంలో అనుభవం ఉన్న అకడమిక్ నాయకత్వం రావడం విద్యార్థులకు కూడా నమ్మకాన్ని పెంచుతుంది.
AISA ఎప్పటిలాగే విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం, పారదర్శక పరిపాలన నెలకొనడం, విద్యార్థుల హక్కులు కాపాడబడడం కోసం పోరాడుతుంది. ఈ నిర్ణయం ఆ దిశగా ఒక సానుకూల సంకేతంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు రవి కుమార్, నాయకులు ఖాసీం, కృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment