15 కోట్ల భారత బంజారా ల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ బోధనలను విస్తృతంగా నేటి యువతరం ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బంజారా నేత సేవాలాల్ జయంతి ఉత్సవాల ప్రచార కమిటీ కన్వీనర్ ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ పేర్కొన్నారు సోమవారం వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో నీ గురునానక్ సమాసంగ్ మహారాజ్ ఆలయంలో 41 రోజుల సేవాలాల్ మాల ధారణ కార్యక్రమం జరిగింది ఉదయం తుల్జా భవాని సద్గురు సామా సంగ్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక అలంకరణ జరిపి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్ మాట్లాడుతూ 41 రోజుల మాలధారులు మత్తుకి మాంసానికి దూరంగా ఉంటూ ప్రత్యేక నియమాలు పాటించి ఆధ్యాత్మిక భక్తి భావాలతో ఉంటూ ఫిబ్రవరి 15 సేవా గడ్ లో జరిగే 287 జయంతి ఉత్సవాలలో పాల్గొని ఇరుముడి విరమణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎస్.కె దాసు నాయక్ మాజీ సర్పంచ్ ఎస్ హాలా నాయక్ నందగోపాల్ నాయక్ ఎస్ సాయి నాయక్ కే మంగ నాయక్ లాల్ తదితరులు పాల్గొన్నారు
సేవాలాల్ బోధనలు విసృతంచేయాలీ
January 05, 2026
0
