ఒక్క పార్క్ ఉంటే ఒట్టు.
మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారేనా?
ప్రజోపయోగ స్థలాలు అప్పనంగా ధారా దత్తం.
ఉరవకొండ పేరు గొప్ప ఊరు దిబ్బ.
పార్క్ ఏర్పాటు యోజన ఏ ఒక్క సర్పంచ్కు లేదు.
జనవరి 5:
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉరవకొండ పట్టణానికి పేరు ఉంది. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఉరవకొండ జనాభా 55 వేల పైచిలుకు ఉంది. ఉరవకొండ ఇప్పటికీ మేజర్ పంచాయతీ గానే కొనసాగుతోంది. విస్తీర్ణంలో జనాభా అన్నిటికన్నా తక్కువగా ఉన్న పామిడి, కళ్యాణదుర్గం లాంటి చిన్న మేజర్ పంచాయతీలు ఎప్పుడో మున్సిపాలిటీలుగా మారాయి. అయితే ఉరవకొండ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మేజర్ పంచాయతీ గానే కొనసాగుతుంది. అభివృద్ధి మాత్రం అంతంత గానే సాగుతోంది.
కొందరు రాజకీయ నాయకుల కుట్రలు, కుతంత్రాల వల్ల మున్సిపాలిటీ కాకుండా అభివృద్ధికి అడ్డుకట్ట వేయటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మున్సిపాలిటీ అయితే పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది అనే వాదనలకు కొందరు పాలకులు త్రిలోకకాలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే మేజర్ గ్రామపంచాయతీ అయినా అభివృద్ధి చెందిందా అంటే అది అంతంత మాత్రమే.
పార్కుల దుస్థితి:
ఇంత పెద్ద మేజర్ పంచాయతీలో సేద తీర్చుకోవటానికి, ఆనందంగా ఆహ్లాదంగా గడపటానికి ఒక్క పార్కుంటే ఒట్టు. గతంలో పదో వార్డులో ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఓ పార్కు ఉండేది. దీంతో పార్కు ఆంజనేయ స్వామిగా పేరు తెక్కింది. ఆ పార్కు కాస్తా కనుమరుగై అక్కడ ఓ ఎలిమెంటరీ పాఠశాలను నిర్మించారు.
ఇది ఇలా ఉంటే పోలీసు గ్రౌండ్ లో అప్పటి దివంగత సీఐ సురేంద్రబాబు ప్రత్యేక చొరవ చూపి పిల్లల కోసం గ్రౌండ్ లో పోలీసు పార్క్ ఏర్పాటు చేశారు. తొలత అది పోలీసు పార్కు అని భావించారు. అయితే ఊరందరి పిల్లలు ఈ పార్కులో వచ్చి ఆటలాడి ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్ళిపోయేవారు. పార్కులో ఆట సామాగ్రి గల్లంతయింది. ఊగుడుబల్లలు, జారగ బండ ఊయల కాస్తా కనుమరుగయ్యాయి. ప్రజోపయోగ స్థలాలను పంచాయతీ వారు కోట్ల రూపాయల విలువ చేసే వాటిలో పార్కు ఏర్పాటు చేయాలనే యోజన లేకపోయింది. పబ్లిక్ స్థలాలను పంచాయతీ వారు ధార దత్తం చేశారు. నాటి నుంచి నేటి వరకు పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏ ఒక్క సర్పంచుకు రాలేదు.
ప్రజల ఇబ్బందులు:
దీంతో పెద్దలకు, పిల్లలకు సేద తీర్చుకోవడానికి ఆనందంగా కాలక్షేపం చేయటానికి పార్కులు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉరవకొండలో క్రీ బసవ స్వామి రిక్రియేషన్ క్లబ్ మాత్రమే ఉంది. ఇందులో పేకాట ఆడుతారు. ఇండోర్ గేమ్స్ ఉండవు. అధికారులకు సభ్యులకు మాత్రమే అనుమతినిస్తారు కానీ బయటి వారిని అనుమతించరు. గ్రామపంచాయతీ వారు చెట్ల పెంపకం పై దృష్టి పెట్టకపోగా రోడ్డు మధ్యలో శ్వాన కోన సంబంధానికి, వ్యాధులు ప్రబలడానికి కారకాలైన చెట్లు వేశారు.
అపరిశుభ్రత - పాలనా వైఫల్యం:
మేజర్ గ్రామపంచాయతీలో గత 25 సంవత్సరాలుగా సానిటరీ ఇన్స్పెక్టర్ లేరు. అలాగే 25 సంవత్సరాలుగా కూరగాయల మార్కెట్ సౌకర్యం లేక కాయగూరల వ్యాపారస్తులు అమ్మకాలు సాగిస్తూ జీవనం చేసుకుంటున్నారు. సెస్ మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మురుగు కాలువలు, రోడ్లు నానాటికి అద్వాన్న స్థితికి చేరుకున్నాయి. పారిశుధ్యంపై శ్రద్ధ కనపరచటం లేదు.
మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గా మారితే పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు వచ్చి, శరవేగంగా ఉరవకొండ ముఖచిత్రం మారుతుందనే భావనలు అభివృద్ధి కాముకులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ ముఖచిత్రాన్ని మారుస్తారనే భావన సర్వత్రా వినిపిస్తోంది. పార్కులు ఏర్పాటు చేసి, ఉరవకొండ ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు.

