రాయలసీమ హక్కులు జలాలు స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు తెలంగాణ కు తాకట్టుపెట్టాడని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గుత్తి చెరువు వద్ద నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ కు 500 టీఎంసీల నికరజలాలు రావాల్సి ఉంటే ఇప్పటికీ కనీసం 200 టీఎంసీల నీళ్లు కూడా రావడం లేదు అందుకే అన్నీ చెరువులకు నీళ్ళు ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రాయలసీమ చెరువులకు నీళ్ళు అందించారు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి తన శిష్యుడు రేవంత్ రెడ్డి కి రాయలసీమ ను తాకట్టు పెట్టాడు అన్నారు.వైఎస్సార్ హయాంలో శ్రీశైలం వెనక జలాలను ఉపయోగించుకొని హంద్రీనీవా కాల్వ నిర్మించి చెరువులకు నీళ్లను అందించారు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా కాలువలు వెడల్పు చేసి కుప్పం వరకు కాలువను తీసుకొని పోయారు.కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో అనేక చెరువులు మరమత్తులు చేసి నీళ్ళు అందించారు. అనంతపురం జిల్లా ఇప్పటికే దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు చేస్తూ కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతోంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అదనంగా నీళ్లు ఇవ్వాల్సింది పోయి పక్క రాష్ట్రాలతో కుమ్మక్కు అయ్యి రాయలసీమ రైతులకు మరణ శాసనం రాస్తున్నారు అని విమర్శించారు.ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి తీసుకు రాకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతాము అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం మండల అధ్యక్షుడు మధుబాబుప్రచార విభాగం మండల అధ్యక్షుడు దేవేంద్ర నాయకులు జ్ఞానేశ్వర్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ కోసం రాయలసీమ హక్కులు తాకట్టు
January 05, 2026
0
