Skip to main content

Posts

Showing posts from November 30, 2025

గంజిగుంట జిల్లాస్థాయిలో మెరిసిన శ్రీ సాహితీ విజ్ఞాన్ విద్యార్థులు

  వజ్రకరూరు మండల పరిధిలోని గంజిగుంట శ్రీసాహితీ విద్యార్థుల ప్రతిభ అనంతపురం జిల్లాలోని టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు జరిగిన జిల్లా స్థాయి అబాకస్ కాంపిటేషన్లో శ్రీ సాహితీ విజ్ఞాన్ స్కూల్ కు సంబంధించిన ఐదవ తరగతి విద్యార్థులు K సాయి ప్రహర్షిత( 5వ) మొదటి స్థాయిలో పొందగా. మరియు  బి ప్రేమ్ రక్షిత్ మరియు కె చందన రెండవ బహుమతులు కైవసం చేసుకున్నారు. మన పాఠశాలకు జిల్లా స్థాయిలో 3 బహుమతులు వచ్చాయి. విద్యార్థులకు మంచి ప్రాక్టీస్ చేయించిన పాఠశాల కు జిల్లా స్థాయిలో పేరు తెచ్చిన అబ్యాక్స్ టీచర్ రామాంజనేయులు ను స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్, హెడ్మాస్టర్ జాకీర్ హుస్సేన్ లు అభినందలతో ముంచెత్తారు. మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

శ్రీలంకలో 'దిత్వా' తుఫాను విధ్వంసం: 123 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు!

  భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ద్వీప దేశం అతలాకుతలం; వేలాది మంది నిరాశ్రయులు కొలంబో, శ్రీలంక: హిందూ మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన 'దిత్వా' తుఫాను శ్రీలంకను పెనువిపత్తులోకి నెట్టింది. గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం (landslides) కారణంగా ద్వీప దేశంలో తీవ్ర ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం సంభవించింది. భారీ ప్రాణ నష్టం, గల్లంతైన ప్రజలు అధికారిక గణాంకాల ప్రకారం, తుఫాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 123 మంది పౌరులు మృతి చెందినట్లు ధృవీకరించబడింది. మృతులలో అత్యధికులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు చెందిన వారే. మరోవైపు, విపత్తు సంభవించిన ప్రాంతాల నుండి సుమారు 130 మందికి పైగా ప్రజల ఆచూకీ లభ్యం కాలేదని విపత్తు నిర్వహణ కేంద్రం (Disaster Management Centre - DMC) ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న జనం, ఆస్తి నష్టం 'దిత్వా' తుఫాను కారణంగా దేశంలోని అనేక జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రధానంగా పశ్చిమ, దక్షిణ మరియు సబ...

ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్

  తిరుమల :- టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ తెలిపింది.  దేవాలయ నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను సంబందిత దేవాదాయ శాఖ కార్యాలయాలకు అందజేయాలని అన్నారు....

తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం: 8 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

  ఎదురెదురుగా ఢీకొన్న రెండు ప్రభుత్వ బస్సులు – శివగంగ జిల్లాలో విషాదం శివగంగ జిల్లా, తమిళనాడు: తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఆదివారం (నవంబర్ 30, 2025) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది (8) మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వివరాలు శివగంగ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై రక్తం మరకలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. సహాయక చర్యలు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జ...

ఉరవకొండ తొలి వృద్ధాశ్రమ నిర్వాహకులు ఎర్రిస్వామి మృతి

  విఠల్ వృద్ధాశ్రమానికి తీరని లోటు; విద్యావేత్తగా, సేవాభావిగా విశేష సేవలు ఉరవకొండ, అనంతపురం జిల్లా: ఉరవకొండ పట్టణంలో తొలిసారిగా 'విఠల్ వృద్ధాశ్రమం' స్థాపించి, నిస్సహాయ వృద్ధులకు ఆశ్రయం కల్పించిన ప్రముఖ విద్యావేత్త, సేవాభావి ఎర్రిస్వామి గారు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసేవ, సామాజిక సేవకు అంకితం ఎర్రిస్వామి గారు అవివాహితులు. ఆయన జీవితంలో భక్తి భావనలు అధికం. ఆయన విద్యావేత్తగా ఉంటూ 'విజయ ట్యూటోరియల్' సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అయితే, సమాజంలో వృద్ధులు మరియు వృద్ధ దంపతులు నిరాదరణకు గురవుతున్న తీరు పట్ల చలించిపోయి, వారికి అండగా నిలవడానికి ఉరవకొండలో మొట్టమొదటిసారిగా వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. ఈయన స్థాపించిన విఠల్ వృద్ధాశ్రమం నిరాశ్రయులైన వృద్ధులకు సురక్షితమైన నీడను అందించింది. తీరని లోటు: ప్రముఖుల సంతాపం సేవా మార్గంలో నడిచిన ఎర్రిస్వామి గారి మృతి పట్టణానికి, ముఖ్యంగా వృద్ధాశ్రమ నిర్వాహణకు తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.   మాజీ వార్డు మెంబర్ సోమశే...

నవంబర్ 2025 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 2025 1న (నేడు) పంపిణీ....

   నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్  ఉరవకొండ మన జన ప్రగతి నవంబర్ 30:  అనంతపురము, నవంబర్ 30: నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 01 వ తేదీ న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం అని జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్, ఐ.ఏ.ఎస్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 1వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.30 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ లో సూచిస్తూ నవంబర్ మాసం పెన్షన్లను డిసెంబర్ 1 వ తారీఖున పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భ...

నారాయణపేట భూ వివాదం: అక్రమ కబ్జాదారుల దౌర్జన్యం- బాధితులకు న్యాయం కరువు

   పల్లబుజూర్గ్ గ్రామ భూమిపై కబ్జాదారుల ఆక్రమణ: సర్వే చేయకుండా అడ్డుకుంటున్న మాఫియా నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా, పల్లబుజూర్గ్ గ్రామంలోని రూ. కోట్ల విలువైన 12 ఎకరాల వ్యవసాయ భూమిపై కబ్జాదారులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ భూమికి చట్టబద్ధమైన హక్కుదారులు అయిన గడ్డం చకలి లక్ష్మప్ప, గడ్డం బాలు, గడ్డం శేషప్ప, గడ్డం శైలు తరపున చేసిన ఫిర్యాదులు ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నా, ఎటువంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూమి హక్కులు & కబ్జా వివరాలు బాధితులైన గడ్డం కుటుంబ సభ్యుల పేరు మీద సర్వే నంబర్లు 114, 115, 118, 119, 120, 121లలో మొత్తం 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు, దీనికి సంబంధించిన అడంగళ్లు, పహానీలు, పట్టా పాస్‌పుస్తకాలు వారి పేర్ల మీదే ఉన్నట్లు ఆధారాలు సమర్పించారు. అక్రమ ఆక్రమణదారులు:  న్యాయవాది సత్తి యాదవ్ నేతృత్వంలో మొత్తం 13 మంది (లక్ష్మణ్ ఎక్బోటే, నాగభూషణం, జారంగ్ జనార్థన్, నాగరాజు, ఎండి. మాసూమ్, లాయక్, సంతోష్ కుమార్, దయానంద్, జారంగ్ జయశ్రీ, అరుణమ్మ, ఘనశ్యామ్ సరోజ) ఈ భూమిని ఆక్రమించి ప్లాట్లు వేసి అక్రమ నిర్మాణాలు ...