అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలంలోని రూపా నాయక్ తండాకు చెందిన 45 ఏళ్ల గిరిజన మహిళ ఆర్. లాలి బాయి అదృశ్యంపై ఆర్. హేమ్లా నాయక్ అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి వినయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన వేడుకున్నారు. అదృశ్యం, ఫిర్యాదు వివరాలు తన భార్య ఆర్. లాలి బాయి సెప్టెంబర్ 28, 2025 న ఇంటి నుంచి కర్నూలు జిల్లా, ఆలూరు మండలములోని అరికెర తండాలో ఉన్న వారి అమ్మగారి గ్రామానికి వెళ్లిందని హేమ్లా నాయక్ తెలిపారు. ఆమె వయస్సు సుమారు 45 సంవత్సరాలు . రెండు, మూడు రోజుల వరకు ఆమె వారి బంధువుల ఇళ్లలో విచారించగా, అక్కడికి రాలేదని చెప్పినారు. దీంతో వారు రెండు, మూడు రోజులు వెతికిన తర్వాత, సెప్టెంబర్ 30, 2025 న వజ్రకరూరు పోలీసు స్టేషన్ నందు ఎస్.ఐ.కి ఫిర్యాదు ఇచ్చారు (ఎఫ్.ఐ.ఆర్. నెం. 117). విచారణ మరియు అరెస్ట్ పోలీసులు సీ.సీ. కెమెరాలో తనిఖీ చేసి చూడగా, ఆమె రాచువారిపల్లికి చెందిన యల్. సురేష్ తో పాటు వెళ్లినట్లు తెలిసింది. పోలీసు వారు అతనిని వెంటనే అరెస్టు చేశారు. అయినప్పటికీ, నిందితుడు విచారణలో పొంత...