Skip to main content

Posts

Showing posts from October 30, 2025

ప్రజాఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడదరబెంచి,డొనేకల్లులో సంతకాల సేకరణ. ఉరవకొండ: విడపనకల్ మండలం కడదరబెంచి, డోనేకల్ గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పేద,మధ్యతరగతి ప్రజలకు వైద్యవిద్యను దూరంచేయాలన్న దుర్బుద్ధికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో కడదరబెంచి,డొనేకల్ గ్రామాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటీకరణను స్వాగతిస్తే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద,మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య కఠిన తరమవుతుందని, కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని వ్యతిరేకించాలని,రాబోవు రోజులలో ప్రజాఉద్యమంలా మారి,కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడనాడి,వెంటనే ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రాకెట్ల అశోక్ కుమార్,మండల కన్వీనర్ రమేష్,విడపనకల్ మండల సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి,మండల ఉపాధ్యక్షుడు బోయ నాగేంద్ర,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఉమాశంకర్,నాయకులు హంపయ్య,హేమంత్,గోపాల్,బద్రి,శేఖర్,మారయ్య,చిద...

ఎవరెస్ట్ శిఖరం దగ్గర కూలిపోయిన హెలికాఫ్టర్‌

ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం..  నేపాల్‌లో మంచు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై జారిపడి..   ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్ సమీపంలోని లోబుచేలో కూలిపోయింది..  ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్‌ అయింది..

ఒక నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్లోఉండాలి

  జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వివరాలు వెల్లడించిన మంత్రులు. పంచాయతీలు, మండలాలు విభజించం రెండు కొత్త జిల్లాలకు అవకాశం. పేర్ల మార్పిడిపై 10న తుది నిర్ణయం తుదిదశలో నివేదిక. జనగణన కన్నా ముందే సీఎంకు వివరాలు అందజేస్తాం.

ఏపీలో భిక్షాటన నిషేధం జీవో జారీ చేసిన ప్రభుత్వం

  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.

మోదీ మంచివాడే... కానీ కఠినమైన వ్యక్తి: ట్రంప్

  దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటన భారత్-పాక్ అంశంపై స్పందన  ప్రధాని మోదీ గురించి ప్రస్తావన భారత ప్రధాని నరేంద్ర మోదీ చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం తన ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో మాట్లాడిన ఆయన, భారత్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, అందుకు మోదీ కఠిన వైఖరే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌ల విషయానికొస్తే... నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాను. నాకు ప్రధాని మోదీపై గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తాను మోదీకి ఫోన్ చేసి, "మీరు పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే మేం మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేం" అని చెప్పినట్లు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. "మోదీ చూడటానికి మంచి వ్యక్తి అయినా, ఆయన చాలా కఠినమైనవారు. యుద్ధం చేసి తీరుతామన్...

వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటికి తీస్తున్న రష్యా!

  అణుశక్తి ఆధారిత 'పోసిడాన్' డ్రోన్‌ను పరీక్షించిన రష్యా పరీక్ష విజయవంతమైందని ప్రకటించిన అధ్యక్షుడు పుతిన్ ఈ ఆయుధం పరిధి అపరిమితమని వెల్లడి త్వరలో 'సర్మత్' క్షిపణిని కూడా మోహరించనున్నట్లు వెల్లడి వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తూ రష్యా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన మాస్కో.. తాజాగా మరో శక్తిమంతమైన ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అణు ఇంధనంతో పనిచేసే మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. దీని పరిధి అపరిమితమని పేర్కొనడం గమనార్హం.  సైనిక ఆసుపత్రిలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వివరాలు వెల్లడించారు. ‘అణుశక్తితో నడిచే ఆటోమేటిక్, మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది రష్యా అమ్ములపొదిలోని అత్యాధునిక ‘సర్మత్’ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తిమంతమైనది. ఓ జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించాం. ఇందులో అమర్చిన అణు విద్యుత్ ప్లాంట్, వ్యూహాత్మక జలాంతర్గామిలోని రియాక్టర్ కన్నా 100 ర...

పంచాయతీ కార్యదర్శి, సీఐ అవినీతిపై మంత్రి పయ్యావులకు ఫిర్యాదు.

ఉరవకొండ:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి,గౌస్ సీఐ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు గురువారం టిడిపి కార్యకర్త, ఎమ్మార్పీఎస్ నేత, జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి మీనుగ మధుబాబు మంత్రికి విన్నవించారు. పట్టణంలో గురువారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలు వీధుల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో మధుబాబు మంత్రిని కలిసి స్వయంగా గోడు వినిపించారు. గ్రామ కార్యదర్శి గౌస్, సీఐ మహానంది వైసీపీ పార్టీకి వీర విధేయులన్నారు. ఆ పార్టీ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి అక్రమ, అడ్డగోలు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.  ఒక కార్యకర్తగా తమ గెలుపుకు కృషి చేశామని తెలిపారు. మంత్రి పదవి పయ్యావుల కేశవకుమంత్రి పదవి వరించాలని ఆర్థిక లేక రెవెన్యూ శాఖ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబు ద...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు *వ్యతిరేకంగా* వైఎస్సార్‌సీపీ 'కోటి సంతకాల' ఉద్యమం

ఉ రవకొండ రూరల్‌లో రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ; గ్రామ కమిటీల నియామకం   ఉరవకొండ :మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) చేపట్టిన 'ప్రజా ఉద్యమం - కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం ఉరవకొండ రూరల్ మండలంలో ఉధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు. నాయకుల ఆదేశాలు, కమిటీల ఏర్పాటు పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. విశ్వేశ్వర్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వై. ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో రాకెట్ల గ్రామం, మోపిడి గ్రామాలలో వైఎస్సార్‌సీపీ గ్రామ ముఖ్య కమిటీలు మరియు అనుబంధ కమిటీలను నియమించడం జరిగింది. రైతు, మహిళ, యువత, విద్యార్థి, ఎస్సీ, బీసీ, సోషల్ మీడియా విభాగాలకు చెందిన కమిటీలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి వీరన్న పాల్గొన్నారు. అబ్జర్వర్‌లు డి. సురేష్, గంగా...

అట్టహాసంగా గుంతకల్ డివిజనల్ స్కూల్ గేమ్స్ పోటీలు: క్రీడాకారుల ప్రతిభ ప్రదర్శన

ఉరవకొండ  :గుంతకల్ డివిజనల్ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు స్థానిక ఎస్.కె. ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు నేడు అట్టహాసంగా జరిగాయి. అండర్-14 మరియు అండర్-17 బాలబాలికల విభాగాల్లో షటిల్ బ్యాడ్మింటన్, యోగా, మరియు ఖోఖో క్రీడల్లో ఈ పోటీలను నిర్వహించారు. గుత్తి, గుంతకల్, వజ్రకరూర్, విడపనకల్, మరియు ఉరవకొండ మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ మూడు క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభాపతుల ప్రసంగం, బహుమతుల ప్రదానం పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్.కె. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఈశ్వరప్ప , ఎంఈఓ-2 రమాదేవి , వజ్రకరూర్ ఎంఈఓ ఎర్రి స్వామి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షాషావలి , మరియు డివిజనల్ లెవెల్ కోఆర్డినేటర్ నాగరాజు హాజరయ్యారు. పోటీలలో ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎంఈఓ ఈశ్వరప్ప చేతుల మీదుగా ట్రోఫీలు మరియు బహుమతులను ప్రదానం చేశారు. ఆయన క్రీడాకారులను అభినందించి, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఈ పోటీల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు కాశీ విశ్వనాథ్ , ఆశ్రఫ్ , శ్రీ మారుతి ప్రసాద్ , రాఘవేంద్ర ,...

భారీ వర్షాలకు రైతుల నష్టం: తక్షణ సహాయం కోరుతూ ఆర్థిక శాఖ మంత్రికి సీపీఎం

   ఉరవకొండ,  అక్టోబర్ 30: ఉరవకొండ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, అలాగే పట్టణంలో తీవ్రంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్) పార్టీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించింది. సీపీఎం నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో బోరుబావులు, బావులు, కాలువల కింద వేసిన వేరుశనగ పంట పూర్తిగా తడిసిపోయి, కనీసం పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కంది పంట పూత మొత్తం రాలిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ముఖ్యంగా, పప్పు శనగ పంట రంగు మారి, పలు ప్రాంతాల్లో కుళ్ళిపోయిందని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వివరించారు.# ప్రధాన డిమాండ్లు: సీపీఎం పార్టీ ప్రధానంగా ఈ కింది డిమాండ్లను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లింది:  * పంట నష్టపరిహారం: నష్టపోయిన అన్ని రకాల పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి.  * డ్రైనేజీ సమస్య పరిష్కారం: ఉరవకొండ పట్టణంలో తీవ్రంగా...

వజ్ర కరూర్ స్టేట్ బ్యాంక్ ఎదుట కౌలు రైతులు ధర్నా

   ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. ఈ మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వజ్ర కరూర్ మండలం లో సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ ఆర్బిఐ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు రెండు లక్షల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని గత సంవత్సరము రుణాలు ఇవ్వాలని కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తే టైం అయిపోయిందని చెప్పారు ఈసారి అయినా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి పెట్టబడదారులకు ప్రైవేట్ కార్పొరేటర్లకు బ్యాంకు రుణాలు ఇస్తారు కానీ రే అనకా పగలనకా కష్టపడి పంటలు పండించే కౌలు రైతులకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు ప్రభుత్వము కౌలు రైతులపై దృష్టి పెట్టి రుణాలు ఇప్పియ్యాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గము కౌలు రైతుల సంఘం కార్యదర్శి పెద్ద ముస్తూర్ వెంకటేశులు ఉరవకొండ నాయకుడు సుంకన్న ప్రసాదు తట్రకల్లు కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు లోకేష్ భారతి బండెప్ప వెంకటేశులు కౌలు రైతులు పాల్గొన్నారు

సముద్రంలో భారీ సింక్‌హోల్: కెమెరాలో బంధించబడిన భయానక దృశ్యం!

   అపారమైన పరిమాణంలో ఉన్న ఒక సముద్రపు సింక్‌హోల్ (కుంగుబాటు గొయ్యి) అకస్మాత్తుగా ఏర్పడి, సమీపంలోని నీటిని, వస్తువులను తన లోపలికి లాగేసుకుంది. ఈ భయంకరమైన దృశ్యం కెమెరాలో బంధించబడింది, ఇది చూసిన వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. హెచ్చరిక లేకుండా ఏర్పడిన సుడిగుండం ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఈ సింక్‌హోల్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా తెరుచుకుంది. దీని కారణంగా ఒక భారీ సుడిగుండం ఏర్పడింది, అది సమీపంలోని నీటి ప్రవాహాన్ని అత్యంత వేగంగా సముద్రపు లోతుల్లోకి లాగేసింది. "అది చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఒక్కసారిగా ఒక నల్లటి గుంట తెరుచుకుంది, నిమిషాల వ్యవధిలోనే నీరు మొత్తం దానిలోకి వెళ్లిపోయింది. ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా అదృశ్యమైంది." అరుదైన సహజ సంఘటననా? సముద్రం అడుగున ఉండే భూగర్భ నిర్మాణంలో మార్పులు లేదా కార్స్ట్ భౌగోళిక ప్రాంతాలలో సున్నపురాయి కరిగిపోవడం వంటి సహజ కారణాల వల్ల సింక్‌హోల్స్ ఏర్పడతాయి. అయితే, సముద్రంలో ఇంత భారీ సుడిగుండాన్ని సృష్టించేంత వేగంగా ఏర్పడటం అనేది అరుదైన సంఘటనగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది హెచ్చరిక సంకేతమా? ఈ సంఘటన చూసిన ప్రజలు మరి...